Adani Group: తెలంగాణలో రూ. 12,400 కోట్లు భారీ పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. బహుళ ప్రయోజనాలతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించి నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Read also: Tamilisai: తమిళిసై ఎక్స్ ఖాతా హ్యాక్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రూ. 1400 కోట్ల పెట్టుబడితో, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్ వద్ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు రూ. 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ నెల ప్రారంభంలో పోర్ట్స్-సెజ్ సీఈవో, గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ, అదానీ ఏరో స్పేస్ సీఈవో ఆశిష్ రాజ్ వంశీ సచివాలయంలో సీఏ రేవంత్ రెడ్డిని కలిశారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు తగిన సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రారంభించిన పాత ప్రాజెక్టులనే కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు.
Read also: LIC MCap : ఎస్బీఐకి వెనక్కి నెట్టి అతిపెద్ద లిస్టెడ్ ప్రభుత్వ కంపెనీగా అవతరించిన ఎల్ఐసీ
తెలంగాణలో ఏరో స్పేస్ పార్క్‌తో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్ సీఎం రేవంత్‌తో చర్చలు జరిపింది. వీటి పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌ను కలిశారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు. దావోస్‌లో సీఎం రేవంత్ మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ అయ్యారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌లతో ఆయన సమావేశమయ్యారు. JSW గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్ VRLDC ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వారికి వివరించారు. రేవంత్ వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.
Sircilla Textile Industry: సిరిసిల్ల పవర్లూమ్స్ కు అందని ఆర్డర్లు.. మూడవ రోజు కొనసాగుతున్న బంద్