NTV Telugu Site icon

Constable Suicide: సూసైడ్ నోట్ రాసి కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఏసీపీ రాజు ఏమన్నారంటే..

Constable Suicide

Constable Suicide

Constable Suicide: ఏఆర్ కానిస్టేబుల్ తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సంచలనంగా మారింది. ఈరోజు తెల్లవారుజామున ఏ ఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గౌడ్ తన తన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున బాత్రూం లోకి వెళ్లి తనవద్ద వున్న గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందినప్పుడు మృతులతోపాటు సహ ఉద్యోగులు ముగ్గురు ఉన్నట్లు సమాచారం. మృతుడు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆదిభట్ల పోలీసులు, నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Read also: Devara: యూఎస్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టేస్తున్న దేవర

సూసైడ్ నోట్‌ పై ఏసీపీ రాజు క్లారిటీ..

కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్‌ రాసినట్లు వచ్చిన వార్తలపై ఏసీపీ కేపీవీ రాజు స్పందించారు. కానిస్టేబుల్ బాలకృష్ణ సూసైడ్ నోట్ రాసింది నిజమే అని. అది మేము కూడా పరిశీలించామన్నారు. సూసైడ్ నోట్ లో ఎవరిమీద ఆరోపణలు, అనుమానాలు లేవని ఏసీపీ క్లిరిటీ ఇచ్చారు. తన చావుకు ఎవరితో సంబంధం లేదన్నట్లు నోట్ వుందని తెలిపారు. ఈ రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కలెక్టరేట్‌ నుంచి సమాచారం వచ్చిందని ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. దూసరి బాలకృష్ణ అనే కానిస్టేబుల్ రంగారెడ్డి కలెక్టరేట్‌ గాడ్‌ గా విధులు నిర్వహిస్తు్న్నాడని వివరించారు. బాత్రూమ్‌ కి వెళ్లి తన తుపాకీతో తనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందినవెంటనే ఘటన వద్దకు చేరుకుని క్లూస్‌ టీమ్‌ కు పిలిపించామన్నారు. అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించామన్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు తెలిపామన్నారు. కానిస్టేబుల్ తండ్రి దూసరి సత్తయ్య వద్ద సమాచారం సేకరించామన్నారు. కానిస్టేబుల్ బాలకృష్ణకు ఒక అక్క, ఒక చెల్లెలు ఉన్నారని తెలిపారు. వారిద్దరికి కూడా వివాహం అయ్యిందని, అందలో ఒకరు కానిస్టేబుల్‌ విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఇంటి నుంచి విధులకు వచ్చినప్పుడు కూడా కానిస్టేబుల్ బాలకృష్ణ ఎలాంటి ఇబ్బందులు లేవని తండ్రి తెలిపినట్లు వివరించారు. పోలీసుల విచారణలో బాలకృష్ణ గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని తెలిపారు. దీనిపై బాలికృష్ణ ఉంటున్న గ్రామంలో అందరూ ఈ విషయం అడగటంతో మానసికంగా కుంగిపోయేవాడని విచారణలో తేలిందని తెలిపారు. ఈ కారణాలతో మానసికంగా కుంగిపోయాని బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని వివరించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతుందన్నారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు కానిస్టేబుల్ మృతదేహాన్ని అప్పగించడం జరుగుతుందని తెలిపారు. డీసీపీ సునితారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Japan PM: జపాన్ ప్రధానిగా మాజీ రక్షణమంత్రి ఇషిబా