Site icon NTV Telugu

ఏసీబీ వలలో కాటారం తహశీల్దార్ సునీత

మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కింది. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3లో తన భూమికి పట్టా పాస్ బుక్కులు ఇచ్చేందుకు తహసీల్దార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం కాటారం తహశీల్దార్ సునీత 2లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Exit mobile version