NTV Telugu Site icon

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఇ

లంచానికి అలవాటు పడ్డ అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు వద్ద 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు విద్యుత్ శాఖ ఏఏఇ రాజ్ కుమార్. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన రైతు షౌకత్ అలీ తన పొలానికి మంజూరైన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఏఇని కోరాడు.

అయితే, అలా చేయడానికి లంచం డిమాండ్ చేశాడు విద్యుత్ శాఖ అధికారి. దీంతో జిల్లా ఏసీబీ అధికారులను సంప్రదించాడు షౌకత్ అలీ. మాజీ మావోయిస్టు షౌకత్ అలీ ప్రస్తుతం గోదావరిఖని ఫైర్ డిపార్ట్మెంట్ లో హోం గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అధికారులు దాడులు చేసి లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.