Errabelli Dayakar Rao: అభయహస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలో ఎర్రబెల్లి పర్యటించారు. సంగెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సంగెం మండలంలోనీ గుంటూరుపల్లి గ్రామంలో రూ.3 కోట్ల 10 లక్షలు,కాపులకనపర్తి గ్రామంలోరూ.8 కోట్ల 18 లక్షలు ,గవిచర్ల గ్రామంలో రూ.14 కోట్ల 19 లక్షలతో మహిళా భవనాలు,సిసి రోడ్లు, బి.టి.రోడ్లు ,కమ్యూనిటీ భవనాలు,గ్రామ పంచాయతీ భవనం,మహిళా సంఘాల భవనాలు ,సబ్ స్టేషన్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం, పలు అభవృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. రైతులకు పంటనష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. సంగేం మండలం అభివృద్ధికి అత్యధిక నిధులను కేటాయించామన్నారు.
పటిష్టమైన విజన్ తో ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు.
Read also: RK Roja: రోజా ఎవరో తెలీదన్న కంగనా.. రోజా షాకింగ్ రియాక్షన్!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఇంటికి మంచినీటి నల్లా, టాయిలెట్ ప్రతీ గ్రామానికి బీటీ, సీసీ రోడ్ ఎర్పాటు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. మహిళల గ్రూప్ సభ్యులకు 22000 కోట్ల లోన్ లు ఇచ్చామన్నారు. మహిళలు ప్రభుత్వం ఇచ్చే లోన్ లతో స్వంతంగా బిజినెస్ చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని గుర్తుచేశారు. అభయహస్తం డబ్బులు వారం రోజుల్లో ఖాతాలో జమ చేస్తామని శుభావార్త చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల వల్లనే ప్రతి వాగులు, వంకలు, చెరువులు నిండు కుండలా కనపడుతున్నాయని తెలిపారు. రైతు బంధు ద్వారా ఎదురు పెట్టుబడి ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించింది తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. వేరే రాష్ట్రాలలో ఇంకా నీటి కోసం బిందెలు పట్టుకొని సూదుర ప్రాంతాలకి వెళ్తున్నారని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన మహిళా గ్రూప్ సభ్యులు చెప్తున్నారని తెలిపారు. దళిత బంధు, రైతు బంధు, రైతు భీమా ఇలా మన పథకాలు ఏ రాష్ట్రంలో లేవని మంత్రి అన్నారు.
Hyderabad Rains: కనీసం కరెంట్ లేదు.. త్రాగడానికి నీళ్లు లేవు.. జర పట్టించుకోండి సారూ!