రోజురోజుకు ప్రజల మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ తన తండ్రి మందలించడంతో ఉసురుతీసుకుంది. మమత అనే మహిళ తన తల్లిదండ్రులతో కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటోంది. మమత కు 2019 వివాహం జరిగింది. అయితే భర్తకు కాన్సర్ ఉందని తెలియడంతో రెండు నెలలకే విడాకులు తీసుకొని, నిజాంపేటలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ, తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తోంది.
అయితే ఈ క్రమంలో మంగళవారం అనారోగ్యంతో ఉన్న మమతను తండ్రి ఎల్లయ్య విధులు వెళ్లోద్దని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన మమత ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఇంటికి తిరిగివచ్చిన తండ్రి ఎల్లయ్యకు కూతురు విగతజీవిగా ఉరివేసుకొని కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.