NTV Telugu Site icon

అర‌గంట‌లో టన్ను చేప‌ల‌ను మాయం చేశారు…ఎలా అంటే…

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని అంకిరెడ్డిగూడెం స్టేజీ స‌మీపంలో క‌ర్ణాట‌కలోని బీద‌ర్ కు వెళ్తున్న ఓ చేప‌ల లోడ్ వాహ‌నం టైర్ పంక్చ‌ర్ అయింది. టైర్ పంక్చ‌ర్ కావ‌డంతో ఆ వాహ‌నం బోల్తా కొట్టింది. దీంతో వాహ‌నంలో ఉన్న చేప‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.  రోడ్డుపై చేప‌లు ప‌డిపోడంతో వాటిని ప‌ట్టుకోవ‌డానికి జ‌నాలు ఎగ‌బ‌డ్డారు.  అంకిరెడ్డిగూడెం స్థానికులు, అటుగా వెళ్లే ప్ర‌యాణికులు చేప‌ల‌ను ప‌ట్టుకోవ‌డాకిని ఎగ‌బ‌డ‌టంతో ఒక్క‌సారిగా ట్రాఫిక్ జామ్ అయింది.  అర‌గంట వ్య‌వ‌ధిలోనే రోడ్డుపై ప‌డ్డ ట‌న్ను చేప‌ల‌ను జ‌నాలు మాయం చేశారు.  అయితే, వాహ‌నంలో త‌ర‌లిస్తున్న చేప‌లు నిషేదిత క్యాట్ ఫిష్ చేప‌లు కావ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.