NTV Telugu Site icon

Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!

Waranagal

Waranagal

Warangal: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్‌తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది. దీంతో ఈ సరుకులను మార్కెట్ కమిటీకి తీసుకెళ్లకుండా రైతులు పలుమార్లు ఉల్లి, టమాటాలను రోడ్డుపై పడేసిన రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం రైతుల పంట పండింది. టమాటాల ధర మోతమోగింది. ఈ పంట ద్వారా రైతులు చాలామంది కోటీశ్వరులయ్యారు. మరికొందరు రైతులు కన్నీరు పెట్టుకుట్టున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు టమోటా కుళ్లిపోయి చెత్తకు చేరడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిన టమాటా ఇప్పుడు వరంగల్ లక్ష్మీపురం మార్కెట్ లోని చెత్తకుప్పకు చేరింది.

Read also: Crying Record: ఏడుపు రికార్డే.. తీరా చూస్తే..

భారీ వర్షాలకు తోడు.. అధిక ధరల కారణంగా విక్రయాలు తగ్గిపోవడంతో టమాట వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. కొద్ది రోజులుగా పెరిగిన టమాటా ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. టమోటా ధరలు పెరగడంతో రైతులు లక్షల్లో ఆర్జించిన వార్తలను కూడా చూస్తున్నాం. ఎంత రేటు పెరిగినా టమాటకు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు వరంగల్ లోని టమాట వ్యాపారులు. మదనపల్లి, కర్ణాటక మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమోటాలు తెప్పించారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. పైగా అధిక ధరల కారణంగా సామాన్యులు టమాటా కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో టమోటాలు పెద్ద ఎత్తున కుళ్లిపోయాయి. దీంతో చేసేదేమీ లేక అవన్నీ తీసుకొచ్చి చెత్తకుండీలో పడేశారు. భారీ పెట్టుబడితో తెచ్చిన టమోటాలు వర్షం కారణంగా ఒక్కరోజులోనే దెబ్బతిన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rohit Sharma: ఎంఎస్ ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ!