Site icon NTV Telugu

Cheating boyfriend: ప్రేమించి మోసపోయింది.. చివరకు ప్రాణం తీసుకుంది

Jagital Crime

Jagital Crime

Cheating boyfriend: యువతి, యువకుడి మధ్య ఏర్పడిన పరిచయం మొదట ఆకర్షణగా, ఆ తర్వాత స్నేహంగా, ప్రేమగా మారుతుంది. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం తట్టుకోలేరు. విభజనను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో విఫలమైతే ఇక జీవితం లేదనుకుంటారు. చావే సరణ్యమని భావిస్తారు. చివరకు ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఆ సమయంలో కన్న తల్లిదండ్రులు కూడా కంటికి కనిపించరు. ప్రేమ లేకపోతే జీవితమే లేదని భావిస్తారు కానీ.. వారి కనిపెంచిన తల్లిదండ్రులను కన్నీటి సాగరంలో ముంచేస్తున్నారు. ఓ యువతి చేసిన పనికూడా అలాంటిదే.. ప్రాణంగా ప్రేమించిన యువకుడు తనను కాదని వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడనే వార్త భరించలేక పోయిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిండి. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

Read also: BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష.. ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద ఆందోళన

ఆత్మహత్య చేసుకున్న యువతి పేరు మౌనికగా గుర్తించారు. మౌనిక స్వస్థలం మంచిర్యాల జిల్లా. ఆమె తల్లిదండ్రులు మంచర్యాలలోని పద్మశాలి కాలనీలో నివసిస్తున్నారు. తండ్రి రాజనర్సు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి విజయలక్ష్మి అంగన్‌వాడీ కార్యకర్త. మౌనిక (23) ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరింది. స్నేహితురాలితో కలిసి ఆస్బెస్టాస్ కాలనీ సమీపంలోని నెహ్రూనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుంటోంది. సాయికుమార్ అనే యువకుడిని మౌనిక కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఈ విషయం రెండు నెలల క్రితం తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి మౌనిక తల్లిదండ్రులు అంగీకరించలేదు. మౌనిక ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి మౌనిక తీవ్ర మనోవేదనకు గురైంది. రోజూ రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసే మౌనిక సోమవారం రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసినా స్పందించలేదు. మంగళవారం ఉదయం కూడా తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అప్పుడు కూడా మౌనిక ఫోన్ ఎత్తలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మౌనిక స్నేహితురాలికి ఫోన్ చేశారు.

అయితే మౌనిక స్నేహితురాలు మాత్రం ఆమె గదిలో లేదని, స్వగ్రామానికి వచ్చిందని చెప్పింది. వారం రోజులుగా ఆమె ఇక్కడే ఉంటోంది. మౌనిక ఫోన్ ఎత్తడం లేదని తల్లిదండ్రులు చెప్పడంతో.. స్నేహితుడిని రూమ్‌కి పంపి కనుక్కుని వస్తానని చెప్పింది. ఈ మేరకు స్నేహితుడిని గదిలోకి పంపగా.. గది తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్లి చూడగా మౌనిక అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమె శరీరం పచ్చగా మారిపోయింది. చుట్టూ చూసేసరికి పురుగుల మందు డబ్బా కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలియజేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలిపింది. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మౌనికను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు మౌనిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మౌనిక ఆత్మహత్యపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
BJP Fast Initiation: బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష.. ధర్నాచౌక్, ఇందిరా పార్క్ వద్ద ఆందోళన

Exit mobile version