Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి ముత్యాల హారం..

Ayodhya Rama Mutyala Haram

Ayodhya Rama Mutyala Haram

Ayodhya Ram Mandir: అయోధ్యలో ఈ నెల22న రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన తరుణం రానే వచ్చింది. ప్రాణప్రిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామ నామంలో మునిగి తేలుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమైంది. అయితే.. దేశవ్యాప్తంగా స్వామివారికి పెద్ద ఎత్తున కానుకలు వస్తున్నాయి. ఇక అయోధ్య రాముడికి ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ వారు హైదరాబాద్ నుంచి మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు హారం వెల్లనుంది. తొమ్మిది మంది కళాకారులతో తొమ్మిది రోజుల్లో తయారు చేశారు. ముంబై నుంచి తెప్పించిన ముత్యాలతో తయారీ చేశారు. మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో హారం ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ తయారు చేశారు. ఈముత్యాల హారం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది.

Read also: Hyderabad Crime: అంబర్‌ పేటలో దారుణం.. పుట్టినరోజే పట్టాలపై..

అయితే ఇప్పటికే.. ఏపీలోని తిరుపతి నుంచి లక్ష లడ్డూలు పంపిస్తుండగా, తెలంగాణకు చెందిన అయోధ్య రాములోరికి బంగారు చీరను కానుకగా పంపుతున్నారు. ఎన్నో అద్భుత కళాఖండాలను తన చేతుల మీదుగా ఆవిష్కరించిన సిరిసిల్ల నేత వెల్ది హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను రాముడికి కానుకగా పంపుతున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నేతన్న హరిప్రసాద్ నివాసానికి వెళ్లి బంగారు చీరను పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారని.. అగ్గిపెట్టెల్లో పట్టుచీరలు తయారు చేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉందని గుర్తు చేశారు. ఇంత గొప్ప నైపుణ్యం ఉన్న చేనేత పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చీర 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేయబడింది. చేనేత కళాకారుడు హరిప్రసాద్ ఈ చీరను రామాయణ ఇతివృత్తాన్ని వర్ణించే చిత్రాలతో తయారు చేశారు.
USA- Israel: అమెరికా- ఇజ్రాయెల్‌ మధ్య భేదాభిప్రాయాలు..

Exit mobile version