NTV Telugu Site icon

Nalgonda Land Issue: భూవివాదం.. ట్రాక్టర్‌తో తొక్కించే యత్నం.. వీడియో వైరల్

Man Attacked With Tractor

Man Attacked With Tractor

A Man Tried To Killed With Tractor In Nalgonda Dist Due To Land Issue: భూమి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం.. తీవ్రంగా ముదిరింది. ఏకంగా ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది. ట్రాక్టర్‌తో తొక్కించి, ఓ వ్యక్తిని చంపాలనుకునేదాకా వ్యవహారం వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం మునుకుంట్లలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

మునుకుంట్లలో ఉంటున్న రవీందర్, విజయ్ సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య కొంతకాలం నుంచి ల్యాండ్ విషయమై వివాదం కొనసాగుతుంది. దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని గ్రామస్థులు సూచించినా.. ఆ ఇద్దరు వెనక్కు తగ్గలేదు. ‘నువ్వా-నేనా’ అనేలా గొడవ పడుతూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ వివాదం ముదిరిపాకాన పడింది. విజయ్ సుధాకర్ తన పొలాన్ని ట్రాక్టర్‌తో చదును చేస్తున్న సమయంలో రవీందర్ అడ్డుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందేనంటూ.. రవీందర్‌ను ట్రాక్టర్‌తో తొక్కించేందుకు విజయ్ ప్రయత్నించాడు.

CM KCR: కేంద్ర ప్రభుత్వ కుట్రల వల్లే దేశంలో నీటి యుద్ధాలు

అయితే.. ట్రాక్టర్ ముందు భాగాన్ని పట్టుకొని రవీందర్ బతికి బయటపడ్డాడు. అప్పటికీ ట్రాక్టర్‌ను ఆపకుండా.. విజయ్ నడుపుతూనే ఉన్నాడు. ట్రాక్టర్ కిందకు వస్తే, రవీందర్‌ను తొక్కించేయాలని అనుకున్నాడు. అక్కడే ఉన్న వ్యక్తులు ట్రాక్టర్ ఆపాల్సిందిగా అరుస్తున్నా.. విజయ్ ఆపకుండా అలానే నడిపాడు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ విషయంపై పోలీసులు జోక్యం చేసుకొని, ఇద్దరి మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా చర్యలు తీసుకోవాలి.

Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. ప్లేట్‌ లేదని ఆపరేషన్‌ అర్ధాంతరంగా నిలిపివేత