Site icon NTV Telugu

Land Disputes: నిజామాబాద్‌లో దారుణం.. తండ్రి, బాబాయ్‌ని పారతో కొట్టి చంపిన కొడుకు

Land Disputes

Land Disputes

Land Disputes: నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో దారుణం జరిగింది. కని పెంచిన తండ్రి, బాబాయిని పారతో అతి కిరాతకంగా కొట్టి చంపాడు కొడుకు. దీనికి గల కారణం భూ తగాదాలే అంటున్నారు స్థానికులు. కర్రోళ్ల అబ్బయ్య, అతని సోదరుడు సాయిలు, అబ్బయ్య కుమారుడు సతీష్‌ కు మధ్య కొద్ది రోజులుగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. భూమి తనకు కావాలని కొడుకు సతీస్‌ తండ్రిని, బాబాయ్‌ ని రోజు వచ్చి గొడవ పడేవాడని వారిద్దరు తీవ్ర మస్తాపం చెందేవారని స్థానికులు తెలిపారు. కొడుకు చేదోడు వాదోడుగా వుంటాడు అనుకుంటే తనకు రోజు భూమి విషయంలో సతాయిస్తున్నాడంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యేవారని తెలిపారు.

read also: Bandi Sanjay Pada Yatra: హైదరాబాద్‌ చేరుకున్న తరుణ్‌ చుగ్‌.. మధ్యాహ్నం కమిటీ సభ్యులతో భేటీ

అయితే ఈనేపథ్యంలో.. రాత్రి తండ్రి, బాబాయ్‌ తో కొడుకు వివాదానికి దిగాడు. భూమి కావల్సిందే అంటూ మోరాయించాడు. అందుకు తండ్రి, బాబాయ్‌ నిరాకరంచడంతో.. కొపంతో రగిలిపోయిన కొడుకు పక్కనే వున్న పారతో తలపై కొట్టాడు. అడ్డుకోబోయిన బాబాయ్‌ ను కూడా తలపై పారతో గట్టిగా కొట్టడంతో.. తీవ్ర రక్తశ్రావ్యం కావండంతో.. తండ్రి, బాబాయ్‌ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితున్ని అదుపులో తీసుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణం భూ తగాదాలు అని పోలీసులకు స్థానికులు తెలిపడంతో.. విచారణ చేస్తున్నారు.
Elon Musk own social media: ఎలాన్‌ మస్క్‌ సంచలనం.. సొంతంగా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్.. పేరు ఇదే..!

Exit mobile version