తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీపై ఇప్పటికే చాలా విమర్శుల ఉన్నాయి. రాష్ట్రంలో మంచి నీరుకైనా కరువు రావచ్చు కానీ మద్యానికి కొదవ లేదూ అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నో సార్లు విమర్శలు గుప్పించాయి కూడా. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కేంద్రం లో శాంతినగర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ మద్యం పాలసీకి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలియజేశాడు. కూరగాయల బండిపై కూరగాయాలతో పాటు బీరు, వీస్కీ బాటిల్ కు కూడా అమ్ముతూ కేకలు వేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొట్టిన కంటైనర్, లారీ, కారు
బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రభుత్వం మద్యం పాలసీకి వ్యతిరేకంగా సోమిశెట్టి దశరథం అనే వ్యక్తి తోపుడు బండి పై ఓవైపు కూరగాయలు, మరోవైపు బీరు, వీస్కీ బాటిల్ పెట్టుకుని పట్టణ వీధుల్లో అమ్మాడు. కూరగాయలు, బీర్లు, విస్కీ బాటిళ్లు అంటూ కేకలు వేస్తూ విక్రయించాడు. ఆయన చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాన్ని దారి వెంట వెళ్లేవారు అక్కడే ఆగి చూస్తూ ఆశ్చర్య పోయారు. అనంతరం అక్కడి స్థానికులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం పాలసీని ఎండగట్టారు. జలకు ప్రస్తుత మద్యం పాలసీతో జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ముందుకు కదిలారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరిని తాగుబోతులను చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడో వంతు మహిళలను వితంతులుగా మార్చే అవకాశం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈయన నిరసనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమంది యూజర్లు ఆయనకు అనుకూలంగా కామెంట్లు పెడుతున్నారు.