Site icon NTV Telugu

పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

petrol suicide

తనకు సంబంధంలేని కేసులో నన్ను వేధిస్తున్నారని ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన లాలాగూడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాలపేటలో నివాసం ఉంటున్న రాజేష్‌ అనే వ్యక్తి గత నెల 27న ఒకరిపై దాడి చేశాడని లాలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సదరు రాజేష్‌ను పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు.

గొడవకు నాకు సంబంధం లేకున్నా నాపై అక్రమంగా కేసు నమోదు చేసిన వేధింపులకు గురి చేస్తున్నారని రాజేష్‌ బుధవారం లాలపేట పోలీస్‌ స్టేషన్‌ ముందు ఒంటిపైన పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై రాజేష్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version