NTV Telugu Site icon

దారుణం : మరో కామాంధుడి చేతిలో బలైన ఓ చిన్నారి..

నేటి సమాజంలో రోజుకో చోట ఆత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా తామ కామవాంఛ తీర్చకుంటున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు.

ఇలాంటి ఘటనే రాజేంద్ర నగర్‌ లోని హిమాయత్ సాగర్ లో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ కు చెందిన కాంతు అనే వ్యక్తి గంజాయి మత్తులో నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు.

చాక్లెట్‌ ఇప్పిస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచి చి‌న్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో తల్లి గుర్తించింది. ఎవరికైనా విషయం చెబితే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. స్థానికుల సహాయంతో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.