Site icon NTV Telugu

Anirudh Reddy: హత్యకేసులున్న వ్యక్తితో స్టేజ్‌ పంచుకోలేను.. మాణిక్కం ఠాగూర్‌ కు లేఖ

Anirudh Reddy

Anirudh Reddy

కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖ రాసారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఇటీవల పార్టీ లో ఎర్రశేఖర్ తీరుపై అనిరుధ్ అసంతృప్తి వ్యక్తం చేసారు. మొదటి నుంచి పార్టీ లో పని చేసుకుంటున్న తనకు ఎర్రశేఖర్ ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రస్తావించారు. తొమ్మిది మర్డర్ కేసులలో నిందితుడుగా ఉన్న ఎర్రశేఖర్ తో స్టేజ్ పంచుకోలేనంటూ ఠాగూర్ కు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. స్వంత తమ్ముడినే హత్య చేసిన ఆరోపణలున్న విషయం ప్రస్తావించారు. ఎర్రశేఖర్ చేరే సందర్భంగా ఒక మాట.. ఇప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

అయితే.. ప్రజలు కూడా ఇదేంటి ఇప్పుడు ఎర్ర శేఖర్​ను తీసుకున్నారు. దేవరకద్ర, మక్తల్​లో తెదేపా వాళ్లను తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ వాళ్ల పరిస్థితి ఏం అవుతుందంటున్నారు. అంతేకాదు.. నాతో ఉన్న క్యాడర్ కూడా పదే పదే అదే చెబుతుంది. తొమ్మిది మర్డర్‌ కేసులలో నిందితుడిగా ఉన్న ఎర్ర శేఖర్‌తో స్టేజ్‌ పంచుకోలేనని లేఖలో స్పష్టం చేశారు. సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారనే ఆరోపణలున్నాయని, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం మిమ్మల్ని చంపరేమని ఉందని క్యాడర్ ప్రశ్నిస్తున్నారని అన్నారు. తను ఇలాంటి వాటికి ఏం భయపడను కానీ.. నాకు ఇంతవరకు మాణిక్కం ఠాగూర్ నుంచి రిప్లై రాలేదని పేర్కొన్నారు. తన వద్దనుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.
Minister Chelluboina Venu: నాడు అమరావతి గ్రాఫిక్స్ సృష్టించారు.. నేడు వైసీపీ నేతలపై గ్రాఫిక్స్‌ చేయిస్తున్నారు..!

Exit mobile version