NTV Telugu Site icon

Minister Errabelli: ఎర్రబెల్లి దయాకరరావు క్యాంప్ కార్యాలయంలో కుప్పకూలిన భారీ వృక్షం

Yerrabelli Dayaker Rao

Yerrabelli Dayaker Rao

Minister Errabelli: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వరంగల్ జిల్లాలో భారీ వర్షం కారణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు క్యాంపు కార్యాలయంలో భారీ వృక్షం నేలకూలింది. అలాగే ప్రహారిగోడను ధ్వంసం చేశారు. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కూలిన విషయం తెలియడంతో క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది కొమ్మలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. అలాగే క్యాంపు కార్యాలయం రక్షణ కోసం నిర్మించిన గోడ కూలిపోవడంతో మళ్లీ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read also: Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు

ఇదే జరిగితే రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరించారు. విపత్తు నిర్వహణ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సహాయం కావాలంటే కాల్ చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి పరిధిలోని ఓపెన్ కాస్టా గనుల్లో గత రెండు రోజులుగా 14 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో సంస్థకు రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు.
Funny Cricket Video: బంతి ఇవ్వనన్న బ్యాటర్.. వెంటపడిన కీపర్! వీడేమో చూస్తే అస్సలు నవ్వాగదు