NTV Telugu Site icon

యూట్యూబ్ నటి సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Sarayu

యూట్యూబ్ లో 7ఆర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలలో బూతుల గురించి అప్పట్లో రచ్చ రచ్చ జరిగింది. ఈ ఛానల్ తో సరయుకు వచ్చిన క్రేజీ అంతాఇంతా కాదు. ఇటీవల సరయు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో మెరిసింది. అయితే ఇప్పుడు మరోసారి సరయు వార్తల్లో నిలిచింది. ఇటీవల సరయు తన హోటల్ కు ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన సాంగ్ లో హిందువులను కించపరిచారని సరయు పై రాజన్న సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

హోటల్ ప్రచార సాంగ్ లో గణపతి బప్పా మోరియా బ్యాండ్ ను తల కు ధరించిన సరయు ఇతరులపై రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వ హిందు పరిషత్ అధ్యక్షుడు చేపూరి ఆశోక్ ఫిర్యాదు చేశారు. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చేపూరి ఆశోక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజన్న సిరిసిల్ల పోలీసులు కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.