A collapsed house roof incident in Hyderabad Old City: రాత్రి ఒక్కసారిగా పెద్ద సబ్దం రావడంతో.. సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరి కొందరు పరుగులు తీసారు. సబ్ద ధాటిని కొందరు బయటకు వచ్చి చూడగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. అందులోని వారందరు బయటకు పరుగులు తీసారు. ఆసమయంలో ఇంట్లో 10 మంది వున్నట్లు సమాచారం. ఈఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ లో నివాసం వుండే షఫీ అనే వ్యక్తికి పాతబస్తీలోని కాళీ కబెర్ ప్రాంతంలో ని KM బస్తిలో బిల్డింగ్ వుంది. అక్కడున్న బిల్డింగ్‌ను బాడిగకు తీసుకుని ఓ కుటుంబం నివాసం వుంటోంది. కానీ.. ఇంటి పైకప్పు రిపేరీలో వుంది.. ఆ విషయాన్ని బాధితులు ఇంటి యజమని షఫీ కి చెప్పిన పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్న ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అందులోనే జీవనం సాగిస్తున్నారు బాధితులు. ఇప్పటి కాకపోయానా మళ్లీ రిపేరి చేయిస్తారులే అని అలాగే వున్నారు. అయితే నిన్న అర్థరాత్రి ఇంట్లో అందరూ గాఢ నిద్రలో వున్నారు. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పిల్లలతో బయటకు పరుగులు తీసారు.
ఇల్లు కూలిన సమయంలో 10 మంది నివాసంలో వున్నారు. అందులో 9 మంది చిన్న పిల్లలే వున్నారు. ఇంట్లో వాళ్లంతా సురక్షితంగా బయట పడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులు మాట్లాడుతూ.. KM బస్తిలో 25 సంవత్సరాలుగా ఇంట్లో నివాసం ఉంటున్నాము. అత్తాపూర్ లో నివాసం ఉండే షఫీ ది ఇల్లు. ఎన్ని సార్లు చెప్పినా ఇంటిని బాగు చేయలేదని వాపోయారు. కొంచం ఏమరుపాటుగా ఉన్నా మా ప్రాణాలు పోయేవని అన్నారు. పిల్లల్ని ఎత్తుకొని కట్టు బట్టలతో బయటికి వచ్చేసామన్నారు. పోలీసులు మాకు బాగా సహకరించారని తెలిపారు. ఉదయం సంఘటన స్థలాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ పరిశీలించనున్నారు. పరిశీలన అనంతరం బిల్డింగ్ ని కూలగొట్టే అవకాశం వుందని సచారం.
Rahul Gandi Bharat Jodo Yatra Live: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
