NTV Telugu Site icon

Rangareddy: రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ .. రంగారెడ్డిలో 46 బస్సులపై కేసు నమోదు

Rangareddy

Rangareddy

Rangareddy: నేటి నుండి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యా సంస్థల బస్సులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని 46 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల ఛంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ రోజు 5 బృందాలు గా ఏర్పడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని,15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితులలో రోడ్ల పైకి తిప్పరాదని తెలిపారు. అనుభవం ఉండి, 60 సంవత్సరాలు మించని డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. ఈ తనిఖీ లు కొనసాగుతాయని అన్నారు. ప్రతీ విద్యా సంస్థ బస్సు తప్పనిసరిగా సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని తెలిపారు.

Read also: TG TET-DSC: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఉచితంగా దరఖాస్తులు చేసుకోండి..

స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ దృష్టి సారిస్తున్నారు. ప్రతి విద్యా సంస్థ యొక్క వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు ప్రతి సంవత్సరం మే 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. స్కూల్ బస్సులు మరమ్మతులు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఈసారి ధ్రువపత్రం అందని వాహనాలతో పాటు విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రవాణా శాఖ నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Europe : ప్రజల పాలిట శాపంగా నాలుగు పరిశ్రమలు.. ప్రతిరోజూ 7000 మంది మృతి