Site icon NTV Telugu

ఘరానా మోసగాళ్లు.. క్రిప్టో కరెన్సీ పేరుతో 85 లక్షలు టోకరా..

నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికి ఎంతో మంది ఉపయోగిస్తుంటే.. కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే మీ డబ్బులు ఎక్కువ అవుతాయంటూ నమ్మబలికి సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్నారు.

ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నారపల్లికి చెందిన ఓ వ్యక్తికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే చాలా డబ్బులు వస్తాయని చెప్పి రూ.85 లక్షల వరకు స్వాహా చేశారు. తీరా ఇదంతా మోసమని తెలియడం సదరు వ్యక్తి పోలీసులను అశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులు 18 సెల్‌ కంపెనీల ద్వారా క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version