NTV Telugu Site icon

Medaram Jatara: మేడారానికి 6 వేల ప్రత్యేక బస్సులు.. నేటి నుంచి 25 వరకు సేవలు

Medaram Jatara Spcial Buses

Medaram Jatara Spcial Buses

Medaram Jatara: ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహాజాతరలో వనదేవతలను దర్శించుకునేందుకు దాదాపు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.105 కోట్లతో జాతర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి మేడారం భక్తులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్‌ఆర్టీసీ 51 కేంద్రాల నుంచి ఏకకాలంలో ఆరు వేలకు పైగా బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామని, గత జాతరలతో పోలిస్తే ఈ ఏడాది ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఆరు వేలకు పైగా ఆర్టీసీ బస్సుల్లో సుమారు 40 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రయాణించే భక్తులకు ఆర్టీసీ ఛార్జీలను కూడా టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

Read also: Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయ్.. పట్టుబడ్డారో ముక్కుపిండి వసూలు చేస్తారు

నేటి నుంచి బస్సులు..

టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా బస్సులను నడిపే అవకాశం ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి దాదాపు 2,500 బస్సులు నడపడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 22 ప్రాంతాల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ చెల్లించిన వారి కోసం ప్రత్యేక మేడారం బస్సులు నడుపుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుండగా.. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నేటి నుంచి 25 వరకు 6 వేల బస్సులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Credit Card Rule: క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు, ఏప్రిల్ 1 నుంచి న్యూ రూల్స్..!