కరోనా సమయంలో కనీసం మానవత్వాన్ని చూపకుండా అందినకాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. కోవిడ్ బాధితుల కుటుంబసభ్యులను వేధించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. లక్షలు లక్షలు బిల్లులు వేసి డెడ్‌బాడీలు అప్పగిస్తున్నారని… డబ్బులు చెల్లిస్తేగానీ మృతదేహాలను ఇవ్వమని వేధిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై వరుసగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.. దీంతో.. ఇప్పటికే ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. ఎలాంటి విరణ ఇవ్వని ఆస్పత్రులపై వరుసగా చర్యలు తీసుకుంటూనే ఉంది.. ఇవాళ. మరో ఆరు ఆస్పత్రుల కోవిడ్ ట్రీట్‌మెంట్ అనుమతిని రద్దు చేసింది తెలంగాణ హెల్త్ డైరెక్టరేట్.. దీంతో కరోనా లైసెన్స్ రద్దు అయిన ఆస్పత్రుల సంఖ్య రాష్ట్రంలో 22కు పెరిగింది.. ఇవాళ కొత్తగా మరో ఎనిమిది ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు.. ఇక, ఇవాళ హెల్త్ డైరెక్టరేట్ కోవిడ్ ట్రీట్‌మెంట్ లైసెన్స్ రద్దు చేసిన ఆస్పత్రుల జాబితాను పరిశీలిస్తే.. సికింద్రాబాద్‌లోని కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్, బంజారాహిల్స్‌లోని సెంచరీ ఆస్పత్రి, లకిడికాపూల్‌లోని లోటస్ ఆస్పత్రి, ఎల్బీనగర్‌లోని మెడిసిన్, టోలిచౌకీలోని ఇంటెగ్రో ఉన్నాయి.. కాగా, ఇప్పటి వరకు 113 ఆస్పత్రులపై 174 ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి.
ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు.. మరో 6 ఆస్పత్రుల లైసెన్స్ రద్దు
private hospital