Site icon NTV Telugu

Dog Attack: మహబూబాబాద్‌లో దారుణం.. నెలల పసికందును చంపిన కుక్కలు

Mahabubabad

Mahabubabad

Dog Attack: కుక్కల దాడితో 42 రోజుల పసికందు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మేడిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దర్శనం వెంకన్న రేణుక దంపతుల మగ శిశువు తీసుకొని గత రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఊరు అయినా మడిపల్లి గ్రామానికి వచ్చారు.. బిడ్డకు రేణుక పాలు పట్టి.. ఇంటి బయట మంచంపై పడుకోబెట్టి మొహం కడుక్కుందామని వెళ్ళింది. ఇంతలోనే అకస్మాత్తుగా వచ్చిన వీధికుక్క నిద్రిస్తున్న పసికందుపై దాడి చేసి చెవులు, తలభాగంలో కర్కశంగా కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.. అది గమనించిన రేణుక గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడకు స్థానికులు పరుగున వచ్చారు.

Read also: Nellore : నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై పెద్దపులి కలకలం..(వీడియో)

అయితే కుక్కల గాట్లతో శిశువుకు తీవ్రంగా రక్తస్త్రావం కావడంతో వెంటనే తొర్రూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పుడు కళ్ల ఎదుట వున్న బాబు ఇంతలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువ అయ్యాయని స్థానికుల వాపోయారు. ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. వెంటనే పై అధికారులు స్పందించి వీధి కుక్కల నిర్మూలించాలని స్థానికులు కోరుతున్నారు. సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో పాపకు అంత్యక్రియ నిర్వహించారు స్థానికులు.
Devara : తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్..?

Exit mobile version