NTV Telugu Site icon

హుజురాబాద్‌లో ఊపందుకున్న పోలింగ్‌..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోలింగ్‌ ఊపందుకుంది.. నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.. ఉదయం పోలింగ్‌ ప్రారభమైనప్పటి నుంచి ఓటర్లు పోలింగ్‌ బూతుల దగ్గర క్యూ కడుతూనే ఉన్నారు.. అయితే, ఉదయం 9 గంటల వరకు 10.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతానికి చేరింది.. ఇక, ఏ పోలింగ్‌ కేంద్రాన్ని చూసినా భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. ఈ సారి పోటీపోటీగా ప్రచారం చేయడం.. అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పోలింగ్‌ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు..

Read Also: మా పోలింగ్‌ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారు.. ఎస్పీకి బీజేపీ ఫిర్యాదు

మరోవైపు, వీణవంక మండలం గణుముక్కలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలింగ్‌ కేంద్రంలో టీఆర్ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. కౌశిక్‌ రెడ్డి నాన్‌లోకల్‌ అంటూ నినాదాలు చేశారు ఈటల వర్గీయులు, ఈ సందర్భంగా టీఆర్ఎస్‌-బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక, వీణవంక మండలం కోర్కల్‌లో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.. ఇరుపార్టీల శ్రేణులు కొట్టుకున్నాయి.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.. ఇలా చెదురుమదరు ఘటనలు మినహా.. హుజురాబాద్‌ బైపోల్‌ ప్రశాంతంగానే సాగుతోంది.