ఎనిమిదేళ్ల క్రితం కొత్త రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు ఉండేవని కానీ ఎనిమిదేళ్ల ప్రగతి ఆ అనుమానాలను పటాపంచలు చేసిందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. దేశంలో ఈ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ జరగడం ఇదే మొదటిసారి అని ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వికేంద్రీకరణలో తెలంగాణ అడుగు వేసిందని అన్నారు. 13 జ్యుడిషియల్ యూనిట్ ఏకంగా 35 జ్యడీషియల్ యూనిట్లు గా మారనున్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధి కూడా ముఖ్యం అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
న్యాయవ్యవస్థ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో గత ఏడాదిగా నా శాయశక్తిగా ప్రయత్నిస్తున్నానని అన్నారు సీజేఐ. ప్రజల్లో న్యాయవ్యవస్థపై ఉన్న అవగాహన పెంచాలని దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించానని తెలిపారు. తెలంగాణలో 32 జిల్లాల న్యాయ సమాహారాన్ని తెలంగాణలో ప్రారంభంచుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ దేశ న్యాయవ్యవస్థలో సరికొత్త అధ్యాయం తెరతీసింది. సాధారణ పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణకు కూడా తెలంగాణ తొలి అడుగు వేసిందన్నారు. తెలుగు నేలపై ప్రారంభం అయినందుకు తెలుగు వాడిగా నేను సంతోషిస్తున్నాని ఎన్వీ రమణ అన్నారు.
ఎన్టీఆర్ తరువాత న్యాయ వ్యవస్థలు తీసుకున్న భారీ సంస్కరణ ఇదే అని సీజేఐ అన్నారు. న్యాయవ్యవస్థ ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం పని చేయదని.. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వ్యవస్థ ప్రయోజనం, సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యం అని అన్నారు. తెలంగాణలో జడ్జీల సంఖ్య 22 నుంచి 42కు పెంచామని గుర్తు చేశారు సీజేఐ.
