Site icon NTV Telugu

యాస్ తుఫాన్ ఎఫెక్ట్‌… తెలంగాణ‌లో వ‌ర్షాలు..

Yaas Cyclone

యాస్ తుఫాన్ నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ‌శాఖ తాజా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది… వాయుగుండం తీవ్రమై ఇవాళ ఉదయం 05.30 గంట‌ల‌కు తూర్పు మధ్య బంగాళాఖాతంలో యాస్ తుఫాన్‌ ఏర్పడినది. ఉద‌యం 08.30 గంట‌ల‌కు పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 530 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమైంది.. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మరియు తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేస్తోంది..

అది ఉత్తర – వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలపడి, వాయువ్య బంగాళాఖాతాములో పశ్చిమ బెంగాల్ కి దగ్గరగా.. ఉత్తర ఒడిశా తీరాలకు 26వ తేదీ ఉదయం చేరుకుంటుంద‌ని తెలిపింది.. మే 26 సుమారుగా మధ్యాహ్నం ఉత్తర ఒడిశా మ‌రియు పశ్చిమ బెంగాల్ తీరాలను, పరదీప్ – సాగర్ ఐలాండ్ ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. దీని ఎఫెక్ట్‌తో ఇవాళ బలమైన కింది స్థాయి గాలులు వాయువ్య, పశ్చిమ దిశల నుండి తెలంగాణా మీదకి వీయ‌నున్నాయి.. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వ‌ర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవ‌కాశం ఉంది.. ఈ స‌మ‌యంలో గాలి వేగం గంటకి 30 నుండి 40 కిలోమీట‌ర్ల‌గా ఉండ‌నుంది.. ఈ రోజు ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Exit mobile version