Site icon NTV Telugu

Road Accident: దారుణం.. అదృశ్యమైన కొడుకు 20 రోజల తర్వాత శవమై దొరికాడు..

Man Died In Road Accident

Man Died In Road Accident

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన కొడుకు 20 రోజల తర్వాత శవమై దొరికిన ఘటన దిల్‌షుఖ్ నగర్ చాదర్ ఘాట్‌లో జరిగింది. తమ కొడుకు మృతి దాచి పోలీసుల అలసత్వం చేయడం వల్ల తమ కొడుకు 18 రోజులు అనాధ శవంగా పడి ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతరమయ్యారు. వివరాలు.. 20 రోజుల క్రితం శ్రవణ్ (23) చాదర్‌ఘాట్ పరిధిలో ప్రమాదానికి గురయ్యాడు. 6వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని కారు అతడిని ఢీకొట్టడంతో శ్రవణ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న చాదర్ ‌ఘాట్ పోలీసులు శ్రవణ్‌ను ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దీంతో రోజులు గడిచిన తమ కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో 20 రోజులుగా వారు స్టేషన్ చూట్టు తిరిగిన పోలీసులు వారి కొడుకు మృతిని చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం గూర్చిమృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చివరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి మార్చురీ లో గుర్తించి అప్పుడు పోలీసులకు సమాచారమందించారు. స్పందించి మృతి చెందాడని అని నిర్లక్ష్యంగా బాధితులకు సమాధానం చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన పోలీసులు దాచి పెట్టడం ఏమిటని బాధితులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు చాదర్ ఘాట్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. తమకు న్యాయం కోసం మృతదేహంతో చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టనున్నారు. ప్రమాదం జరిగి 20 రోజుల జరిగిన సిసి ఫుటేజ్ ఆధారంగా ప్రమాద కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version