NTV Telugu Site icon

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2290 మంది.. అత్యధికంగా ఎక్కడంటే

Telangana Elections 2023 Lb Nagar

Telangana Elections 2023 Lb Nagar

Telangana Elections 2023: నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. తర్వాత రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎల్బీనగర్ లో 48 మంది, గజ్వేల్ లో 44, కామారెడ్డి 39, మేడ్చల్ 39, నారాయణపేట 7, బాన్సువాడ 7 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 48 మంది ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి పోటీపడుతున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నారాయణపేట నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యల్పంగా ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా నామినేషన్లు దాఖలైన గజ్వేల్‌లో 70 మంది ఇండిపెండెంట్లు ఉపసంహరించుకోవడంతో 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డివిజన్ అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులను కేటాయించింది.

జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీలకు వారి అభ్యర్థన మేరకు ఉమ్మడి గుర్తును కేటాయించగా, స్వతంత్ర అభ్యర్థులకు వారి ఎంపిక మేరకు గుర్తులను కేటాయించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఒకే గుర్తు కావాలని లాటరీ తగిలింది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల క్రమం కూడా ఖరారైంది. దీంతో పాటు గురు, శుక్రవారాల్లో అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో 16 మంది కంటే తక్కువ అభ్యర్థులు ఉన్నందున, ఒకే బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటింగ్ నిర్వహించబడుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల అధికారులు ఓటింగ్ స్లిప్పుల పంపిణీ ప్రారంభించారు. కొన్ని జిల్లాల్లో బుధవారం నుంచి, మరికొన్ని జిల్లాల్లో గురువారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25లోగా ఓటింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తవుతుంది.
Etela Rajender: కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడే తప్ప అభివృద్ధి చేయలేదు