1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- 1980s ట్రెండ్‌పై సైబర్ కేటుగాళ్ల కన్ను
- సోషల్ మీడియాలో ఫేక్ యాప్స్ ప్రత్యక్షం
- ఫోటో ఎడిటింగ్ కోసం APKల వలలో నెటిజన్లు
- నకిలీ యాప్స్ డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1980s Trend : ప్రస్తుతం సోషల్ మీడియాలో 1980s ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్‌ను సైబర్ కేటుగాళ్లు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 1980s పేరుతో నకిలీ యాప్స్‌ను క్రియేట్ చేసి.. వాటి ద్వారా APK ఫైల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఫేక్ యాప్స్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నెటిజన్లు వాటిని నిజమైన యాప్స్‌గా భావించి డౌన్లోడ్ చేసుకునే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా చాట్‌జీపీటీలో ఫోటో ఎడిటింగ్‌కు సంబంధించిన కొన్ని లిమిట్స్ ఉండటంతో.. కొందరు నెటిజన్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్‌ను ప్రచారం చేస్తూ.. వాటి ద్వారా ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చంటూ నమ్మిస్తున్నారు. అయితే ఇలాంటి యాప్స్‌ను డౌన్లోడ్ చేస్తే ఫోన్లోని వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, ఇతర సున్నితమైన డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
Also Read
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
సోషల్ మీడియాలో కనిపించే ప్రతి APK ఫైల్‌ను నమ్మి డౌన్లోడ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని లింకులపై క్లిక్ చేయడం, గుర్తు తెలియని యాప్స్‌కు ఫోన్లో అనుమతులు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ట్రెండ్ పేరుతో వచ్చే ఫేక్ యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, యాప్‌ను ఇన్స్టాల్ చేసే ముందు దాని సోర్స్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?