NTV Telugu Site icon

ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా కలకలం

గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను సైతం కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. ఫస్ట్, సెకండ్ వేవ్ కంటే వేగంగా థర్డ్ వేవ్ లో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధించారు.

అయితే థర్డ్ వేవ్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు సైతం కరోనా పడుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే తాజాగా ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా రిమ్స్ లో మరో 14 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. మెడికల్ స్టూడెంట్స్ 7 మందికి, ముగ్గురు డాక్టర్లకు, 4గురు హౌజ్ సర్జన్లకు కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయింది. దీంతో మొత్తం రిమ్స్ లో ఇప్పటివరకు 94 మందికి కరోనా సోకింది.