Site icon NTV Telugu

Coronavirus: తెలంగాణలో కరోనా కలకలం.. కొత్తగా 12 పాజిటివ్ కేసులు

Coronavirus

Coronavirus

రోజుకు రోజుకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పన్నెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో మూడింట రెండొంతులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు బులెటిన్ తెలిపింది.

ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి ఒకరు కోలుకోగా… 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ముప్పై మందికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని వెల్లడించింది. అలాగే నిలోఫర్ ఆసుపత్రి ఒక పాజిటివ్ కేసు నమోదైంది. నిన్న 51 శాంపిల్స్ టెస్టు‌ కోసం పంపగా ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌ రాగా.. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Exit mobile version