Jangaon: అప్పటి వరకు ఆడుకుంటున్న 11 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఊపిరాడక మృతి చెందిన హృదయ విదారక ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన లక్ష్మణ్, గీత భార్యాభర్తలు. ఇద్దరూ ఒక మిషన్ మీద జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు. అయితే సోమవారం సాయంత్రం మిషన్ కుట్టిస్తూ భార్యాభర్తలు పనిలో పడ్డారు. అయితే పదకొండు నెలల కొడుకు హేమంత్ అప్పటి వరకు అక్కడే ఆడుకుంటున్నాడు. కాసేపు.. మెల్లగా నీళ్ల బకెట్ దగ్గరికి వెళ్లి నీళ్లతో ఆడుకున్నాడు. అయితే.. అప్పటి వరకు ఆడుకుంటున్న హేమంత్.. కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు. కొడుకు కనిపించకపోవడాన్ని గమనించిన తల్లి కంగారు పడింది.
Read also: OMG: ఓరి దేవుడా! ఎయిర్‌పోర్టులో మసాలా మ్యాగీ.. రూ.193
అయితే.. అనుకోకుండా ఆడుతూ ఆడుకుంటూ.. హేమంత్ బకెట్‌లో పడిపోయాడు. బకెట్‌లో పడిన తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న హేమంత్‌ని చూసి తల్లి షాక్‌కు గురైంది. వెంటనే చిన్నారిని బకెట్ లో నుంచి బయటకు తీసుసింది. హేమంత్ నోట మాట రాలేదు. దీంతో తల్లి కంగారు పడింది. చిన్నారిని తీసుకుని ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. తమ ముందు ఉల్లాసంగా ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లోనే తమను వదిలేసి వెళ్లడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదించారు. తమ అజాగ్రత్త వల్లే.. కొడుకు చనిపోయాడని గుండెలు బాదుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Astrology : జులై 18, మంగళవారం దినఫలాలు