TS SSC Results 2024: తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, కంప్యూటరీకరణ కూడా పూర్తికావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. పదో తరగతి ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా.. మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగా.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది.
Read also: Online Fraud: ఆన్ లైన్ లో కేటుగాళ్లు చైన్ బిజినెస్.. కాస్ట్ కో లింకు తో టార్గెట్
https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను కనుగొనవచ్చు. విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగియగా.. మే 10న ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 15 రోజుల ముందుగానే పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటికే ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఏపీ 10 పరీక్షల్లో 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 84.32 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా పార్వతీపురం జిల్లాలో 96.37 మంది ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.47 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో మే 24 నుంచి జూన్ 3 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 2,803 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 17 పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు.
Supreme Court : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టులో విచారణకు డిమాండ్