ఆపరేషన్ ముస్కాన్ లో దొరికిన మైనర్లు పరారయ్యారు.పట్టుబడ్డ బాలలను సైదాబాద్ లోని జువైనల్ హోమ్ లో ఉంచారు సీడబ్ల్యూసీ సిబ్బంది. జువైనల్ హోమ్ నుండి పారిపోయారు పది మంది బాలురు. ఆదివారం సెలవు దినం, సిబ్బంది తక్కువగా ఉంటారని పారిపోయేందుకు ప్లాన్ వేశారు ఆ పది మంది బాలురు. నిన్న ఉదయం గేటు వద్ద సిబ్బంది ఒక్కడే ఉండటాన్ని గమనించి అతనిపై దాడి చేసి గేట్ తాళం తీసుకొని పారిపోయారు పది మంది. ఆ గేట్ దగ్గర ఉన్న వ్యక్తి అరుపులతో అప్రమత్తమైన సిబ్బంది… పారిపోతున్న పది మంది బాలురు లో నలుగురిని పట్టుకున్నారు. పారిపోయిన వీరంతా బీహార్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన బాలురు. దీని పై సైదాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చిన ఇచ్చారు హోమ్ సిబ్బంది. ప్రస్తుతం పారిపోయిన వారి కోసం వెతుకుతున్నారు సీడబ్ల్యూసీ, పోలీసులు.
ఆపరేషన్ ముస్కాన్ లో దొరికిన మైనర్లు పరారి…
