రాజేంద్రనగర్ బుద్వేల్ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఐదుగురం లిఫ్ట్ లో ఇరుక్కుని పొగ కారణంగా శాస్వ అడడం లేదని 100 కు కాల్ చేసారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన రాజేంద్రనగర్ పోలీసులు. బుద్వేల్ ప్రాంతానికి ఉరుకులు పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదం లో ఐదుగురు చిక్కుకున్నారనే సమాచారం తో బుద్వేల్ ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బందితో పాటుగా అంబులెన్స్ లు కూడా వెళ్లాయి. బుద్వేల్ లో వున్న ప్రతి గల్లిని చుట్టుముట్టారు ఐదు మంది ఎస్ఐలు, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్. చివరకు ఓ న్యాయవాది ఇంట్లో లిఫ్ట్ లో ఆగిపోయి అందులో ఇరుకున్నారంటూ సమాచారం తెలుసుకొని… హుటాహుటిన అక్కడికి వెళ్ళి లిఫ్ట్ లో ఇరుకున్న వారిని సురక్షితంగా కాపాడారు పోలీసులు. అయితే అగ్ని ప్రమాదం జరిగిందని తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఇంటి యాజమాని పై ఫైయర్ అయ్యారు రాజేంద్రనగర్ ఏసీపీ.
అగ్ని ప్రమాదంలో ఇరుకున్నామని పోలీసులకు ఫోన్.. కానీ..?
