Site icon NTV Telugu

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన ఘట్టం

Nominations

Nominations

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది, 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న నామినేషన్ల పరిశీలనలో 6 వందలకు పైగా నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. కాగా, నాగార్జున సాగర్ లో జానారెడ్డి, హుజూరాబాద్ లో ఈటెల జమున నామినేషన్ తిరస్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీవి అత్యధికంగా 7 సెగ్మెంట్లలో అభ్యర్థుల నామినేషన్లను ఆర్వో అధికారులు రిజెక్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల పై పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఖమ్మంలో పువ్వాడపై తుమ్మల నాగేశ్వరరావు, దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి మధుసూధన్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫిర్యాధు, పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిపై బీఆర్ఎస్ ఫిర్యాధు, అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

Read Also: Caste Census: ఏపీలో రేపటి నుంచి కుల గణన.. 5 ప్రాంతాల్లో ప్రారంభం..

అయితే, ఇప్పటి వరకు నామినేషన్‌ల పరిశీలన ప్రక్రియ ఘట్టం ముగిసిపోవడంతో.. ఇక పోలింగ్ తేదీ వరకు ఇంకా ఎంత మంది తమ నామినేషన్‌లను విత్‌ డ్రా చేసుకుంటారో అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. ఎంత మంది ఎన్నికల బరిలో ఉంటారో అనేది వేచి చూడాలి.. చివరకు ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు విజేతగా నిలుస్తాడో తెలియాలంటే వచ్చే నెల 3వ తేదీ వరకు వేచి చూడాలి.. దీంతో రేపటితో నామినేషన్ల ఉప సంహరణకు గడువు కూడా ముగియనుంది. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది.

Exit mobile version