Site icon NTV Telugu

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం

Revanthreddy

Revanthreddy

వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ లో కాంగ్రెస్ విజయ భేరి యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే దౌల్తాబాద్ లో అభివృద్ధి, సంక్షేమం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, కాలేజీలు తెస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు.. పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చని నేతలు మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నారు.. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు నేను తీసుకొచ్చినవే అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also: BRS Legal Team: కాంగ్రెస్ పార్టీపై సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం.. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం.. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం.. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం.. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం.. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తామన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version