NTV Telugu Site icon

Revanth Reddy Fire On KCR: నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి

Tpcc

Tpcc

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక గడ్డకి ఒక చరిత్ర ఉంది.. దుబ్బాకకి రావాల్సిన నిధులు ఆనాడు కేసీఆర్ సిద్దిపేటకి తీసుకెళ్లారు.. కేసీఆర్ తో కొట్లాడి దుబ్బాకకి నిధులు తెచ్చిన ఘనత దివంగత ఎమ్మెల్యే ముత్యం రెడ్డిది.. ఈనాడు హరీష్ రావు కూడా దుబ్బాక నిధులు సిద్దిపేటకి తీసుకెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు. దుబ్బాకకి వచ్చిన ఆస్పత్రులు, కాలేజీలు రద్దు చేసి మామా అల్లుళ్లు సిద్దిపేటకి తీసుకు వెళ్లారు.. దుబ్బాక ఉప ఎన్నికలో వాళ్ల బంధువు గెలవాలని బీజేపీ అభ్యర్థిని గెలిపించారు.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అది చేస్తా ఇది చేస్తా అని రఘునందన్ రావు అన్నారు.. రఘునందన్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు..ఆయనకి ఓటు అడిగే హక్కు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Read Also: Central IT Department: కలకలం సృష్టిస్తున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు.. రంగం లోకి కేంద్రం

బీజేపీ వాళ్లే బండి సంజయ్ పై ఆరోపణలు చేసుకుంటూ పార్టీ కుమ్ములాటలు తప్ప ఇక్కడ ఏం చేయ్యలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త కానీ అది పాత చింతకాయ పచ్చడి.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే కేసీఆర్ కి ఎందుకు నొప్పి అంటూ విమర్శించారు. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఊర్లు తిరుగుతూ కేసీఆర్ వగల ఎడుపులు ఏడుస్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. నేను బక్కోన్ని..కాంగ్రెస్ వాళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నారు అంటున్నారు.. నువ్వు బక్కోనివి కాదు బకాసూరిడివి.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడివి అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Vishnupriya Bhimeneni: హాఫ్ శారీలో విష్ణు ప్రియ అందాల జాతర

ఇక, దుబ్బాకకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓ పక్క హరీష్ రావు, మరో పక్క కేటీఆర్ దుబ్బాకని బంగారు తునక లాగా చేస్తా అన్నారు.. పదేళ్లు అయ్యింది దుబ్బాకని బొందల గడ్డ చేశారు.. కేసీఆర్ మందేసి మట్లాడుతున్నాడో మతి పోయి మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు.. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగదు.. ఎవరికి డబుల్ బెడ్ రూమ్ రాలే కానీ పక్కనే ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే నెల నుంచి కేసీఆర్ కి 4 వేల పెన్షన్ ఇస్తానన్నారు.. కేసీఆర్ కి డబుల్ బెడ్ రూమ్ చర్లపల్లి జైలులో కట్టిస్తాం.. కేసీఆర్ దోచుకున్నది కక్కిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Show comments