నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. అయితే, (శుక్రవారం) రాత్రికే ఆయన హైదరాబాద్ కు రావాల్సి ఉండగా మారిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12.50 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు గద్వాల నుంచి నల్లగొండకు వెళ్లనున్నారు.
Read Also: Astrology: నవంబర్ 18, శనివారం దినఫలాలు
ఇక, మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడనున్నారు. ఇక, చివరగా సాయంత్రం 4.20 గంటలకు వరంగల్ చేరుకుని అక్కడి సభలో ప్రసంగించనున్నారు. వరంగల్ నుంచి సాయంత్రం 6 గంటలకు బేగంపేటకు చేరుకుని.. హోటల్ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్ షా రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలతో సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక, రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి అహ్మదాబాద్‌కు అమిత్ షా బయలుదేరి వెళ్లనున్నారు.
Read Also: Gold Price Today : పరుగులు పెడుతున్న పుత్తడి ధర.. అదే దారిలో వెండి.. ఈరోజు ఎంతంటే?
అయితే, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఇంటింటికీ చేరేలా కమలం పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలంగఆణ బీజేపీ రాష్ట్ర అధక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు ఎన్నికల ప్రచార సభలను పెద్ద ఎత్తున చేపడతామని చెప్పుకొచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హేమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ ఈ సభల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు.