Liquor Shops all over Telangana Re opened after Polling: మందుబాబులకు అలెర్ట్, భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు తెరుచుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మద్యం, కల్లు దుకాణాలు.. అలాగే వైన్స్, బార్లు అన్నీ కూడా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సాయంత్రం 30వ తేదీ పోలింగ్ అనంతరం మద్యం షాపులు తిరిగి తెరుచుకున్నాయి. షాప్స్ ఓపెన్ అవక ముందు నుంచే వైన్స్ ల ముందు మందుబాబులు వెయిటింగ్ చేస్తున్నారు. ఫేవరేట్ హీరో మూవీ వస్తే థియేటర్లలో టికెట్ కోసం కొట్టుకున్నట్టు మందు బాటిళ్ల కోసం మందుబాబులు కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పుడు అయితే సిటీలోని ప్రతి వైన్స్ దగ్గర ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది.
Prabhas: ఓటు వేయని ప్రభాస్.. ఎక్కడున్నాడు.. ?
ఎన్నికల సందర్భంగా మొన్న సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసిన వైన్స్ లను ఓటింగ్ ముగియడంతో కాసేపటి క్రితమే తెరిచారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సు గడువు నేటితో ముగియనుంది. ఇటీవల నిర్వహించిన టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఇక వీటిల్లో రిజర్వేషన్ ద్వారా 786 మద్యం దుకాణాలు గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు దక్కగా ఈ నవంబర్‌లో 2,200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. నవంబర్‌లోగా పాత స్టాక్‌ను క్లియర్ చేయడం, ఎన్నికలు కూడా ఇదే నెలలో రావడంతో భారీగా అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు.