Site icon NTV Telugu

Kollapur: కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి

Barrelakka

Barrelakka

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్కపై (శిరీష) నిన్న దాడి జరిగింది. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. బర్రెలక్కకు సపోర్టుగా ప్రచారంలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నిస్తూ కన్నీటి బర్రెలక్క పర్యంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also: IMD Alert: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ఓట్లు చీలుతాయనే భయంతోనే తనపై రాజకీయ దాడులకు పాల్పడుతున్నారని బర్రెలక్క ( శిరీష ) వ్యాఖ్యానించింది. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. కాగా, బర్రెలక్కపై దాడిని ఖండిస్తూ పలువురు ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు. బర్రెలక్కకు భద్రతను కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

Read Also: Ram Charan: గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యేదెప్పుడో శంకరా…

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బర్రెలక్క హాట్ టాపిక్‌గా మారింది. ప్రచారంలో దూసుకుపోతూ అందరి దృష్టిని ఆమె ఆకర్షిస్తోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తుంది. నామినేషన్ వేసినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క పెద్ద చర్ఛనీయాంశంగా మారింది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థుల గుండెల్లో ఆమె గుబులు రేపుతోంది.

Exit mobile version