Site icon NTV Telugu

Hyderabad: పాతబస్తీలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు..

Old City

Old City

పాతబస్తీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మలక్ పేట్, చార్మినార్, యాకుత్ పురా, చంద్రయాన్ గుట్ట, బహదూర్ పురా, కార్వాన్, గోషామహల్ ఏడు నియోజకవర్గాలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పాతబస్తీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టవంతమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 48 గంటల పాటు అలెర్ట్ గా ప్లటూన్స్ పోలీసులు ఉన్నారు. ఇక, అందుబాటులో పలు కేంద్ర బలగాలు.. ఐదు వేల మందికి పైగా పోలీస్ సిబ్బంది భద్రత విధుల్లో ఉన్నారు. సీసీ కెమెరా నిఘా నీడలో సెన్సిటివ్ ఏరియాస్.. హైదరాబాద్ లో 666 సున్నిత ప్రాంతాలలో పోలీస్ గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీ భద్రతా విధుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండిస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్, కర్ణాటక పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ గస్తీ కాస్తున్నాయి.

Read Also: Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్‌!

ఏడు పాతబస్తీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు
చంద్రయాన్ గుట్ట లో 327 పోలింగ్ కేంద్రాలు..
యాకుత్ పురా లో 280 పోలింగ్ కేంద్రాలు..
మలక్ పేటలో 300 పోలింగ్ కేంద్రాలు..
చార్మినార్ లో 243 పోలింగ్ కేంద్రాలు..
బహదూర్ పురాలో 220 పోలింగ్ కేంద్రాలు..
కార్వాన్ లో 311 పోలింగ్ కేంద్రాలు..
గోషామహల్ లో 235 పోలింగ్ కేంద్రాలు

పాతబస్తీ సమస్యత్మక ప్రాంతాలు ఇవే..
మలక్ పేట్, ఓల్డ్ మలక్ పెట్, అజాం పుర, ముసరాం బాగ్, చదార్ ఘాట్,
చంద్రాయన్ గుట్ట, ఛత్రినాక లాల్ దర్వాజా, బార్కాస్ జంగంపేట్, ఇది బజార్, ఉప్పుగూడ బండ్లగూడ
యాకుత్ పురా, డబిర్ పురా, నూర్ ఖాన్ బజార్, మీర్ చౌక్, దారుల్ శిఫా, చంచల్ గూడ, కుర్మగుడ, మధనాపెట్, రెయిన్ బజార్, మొఘల్ పురా,
చార్మినార్, కిల్వత్, హుసేన్ అలం,చెలాపురా, మిట్టి కా షేర్, చార్ కమాన్, ఘాన్సీ బజార్, ముర్గి చౌక్, పత్తర్ ఘాట్, పార్డీవాడ, షాలిబండ
బహదూర్ పురా, అలియాబాద్ జహనుమా, ఫలక్‌నుమా, దూద్ బోలి, హషమాబాద్
కార్వాన్, లంగర్ హౌస్, గోల్కొండ, గుడిమల్కాపూర్ జిర్రా, టపాచబుత్ర, టొలిచౌకి, జియాగూడ.
గోషామహల్, అఫ్జల్ గంజ్, దూల్ పేట్, మంఘాల్ హాట్, సీతారాం బాగ్, మోజం జాహీ మార్కెట్, ఆగాపుర.

Exit mobile version