EC Suspends Hyderabad Police Officers: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులను బుధవారం ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకే వారిపై సస్పెన్షన్ వేటు పడింది. వారు ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ల. వివరాలు.. మంగళవారం రాత్రి ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు జయసింహా ముఠా ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికారు. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు జయసింహా ముఠాను తప్పించి మిగిలిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి ఎమ్మెల్యే కొడుకు సహాకరించినందుకు సీఐ, ఏసీపీ, డీసీపీలను ఈసీ సస్పెండ్ చేసింది.
Election Commission: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు

Ec Suspends Hyderabad Cops