Site icon NTV Telugu

BRS Vs Congress: ప్రగతి భవన్ లో కారు బోల్తా…కారు దెబ్బకు పచ్చడయ్యిన చెయ్యి?

Brs Vs Congress

Brs Vs Congress

BRS Vs Congress Twitter fight goes viral in Social Media: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 51% పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ బలంగా చెబుతుంటే 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బీఆర్ఎస్ నుంచి విముక్తి కలుగుతుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. కేసీఆర్ ఇప్పటికే మొట్టమొదటి ఫైల్ గా దేని మీద సంతకం పెట్టాలి అనే విషయం మీద సమాలోచనలు జరుపుతున్నట్లు బిఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంటే.

Telangana Elections 2023: తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు నమోాదైన పోలింగ్

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేస్తారని అదే రోజు కేబినెట్ మీటింగ్ నిర్వహించి మొదటి సంతకం ఏ ఫైల్ మీద పెట్టాలని విషయం మీద కూడా చర్చలు జరుపుతున్నామని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ ఖాతాల మధ్య కూడా ఇదే విధమైన పోటీ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి బ్రేకింగ్ న్యూస్ ప్రగతి భవన్ లో కారు బోల్తా అంటూ ఒక ట్వీట్ వేయగా దానికి కౌంటర్ ఇస్తూ కారు దెబ్బకు చెయ్యి పచ్చడి అయింది అంటూ అధికారిక బిఆర్ఎస్ ట్విట్టర్ ఖాతా నుంచి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ హడావిడి భలే ఉంది అంటూ సాధారణంగా నెటిజన్లు కామెంట్ చేసుకుంటున్నారు.

Exit mobile version