మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? మంచి ఫుడ్ తినాలని భావిస్తున్నారా? అయితే మీ కోరిక నెరవేరనుంది. IRCTC సౌజన్యంతో రైలులో మంచి ఫుడ్ తినే అవకాశం కలగనుంది. మీ రైలు ప్రయాణం మరింత కొత్తగా రూపొందించుకోవచ్చు. ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తూ తమకు కావాల్సిన ఆహారాన్ని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్ సీటీసీకి చెందిన ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘జూప్’ ఇటీవలే జియో హ్యాప్టిక్ తో ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రయాణికులు తమ వాట్సాప్ నుంచి ఫుడ్ కోసం ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు అదీ చాలా సులువుగా మీ PNR నెంబర్ ఆధారంగా బుక్ చేసుకుని, ఫుడ్ పొందవచ్చు అంటోంది IRCTC.
Read Also: Budda Venkanna: వైసీపీ అజెండా అమలు చేసే పోలీసుల్ని చొక్కాలు ఊడతీసి కొడతాం
ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ కోసం వేరే ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సేవను ఐఆర్ సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జూప్ వాట్సాప్ ఖాతా నుంచి కోరుకున్నది ఆర్డర్ చేయవచ్చు. తదుపరి స్టేషన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇందుకోసం ప్రయాణికులు తమ ఫోన్ లో జూప్ వాట్సాప్ నంబర్ 7042062070 ను సేవ్ చేసుకోవాలి. ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు 10 అంకెల పీఎన్ఆర్ నమోదు చేయాలి. పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడు ఏ కోచ్ లో, ఏ బెర్త్ లో ఉన్నది వారికి తెలుస్తుంది. మీరు ఎక్కడ వున్నారో లొకేషన్ షేర్ చేయాల్పింది లేదు.
మీరు రైలులో వుంటే చాలు. అనంతరం వచ్చే స్టేషన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని జూప్ చాట్ బోట్ అడుగుతుంది. తర్వాత ఆ స్టేషన్ లోని రెస్టారెంట్లు, వాటిల్లోని ఫుడ్ మెనూను అందిస్తుంది. కావాల్సిన దాన్ని ఆర్డర్ చేసి, అక్కడి నుంచే పేమెంట్ చేయవచ్చు. ప్రయాణికుడు ఎంపిక చేసుకున్న స్టేషన్ రాగానే, ఆర్డర్ డెలివరీ అవుతుంది. ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు ట్రాక్ కూడా చేసుకోవచ్చు. మీ ఆర్డర్ ఎక్కడ వుందో, ఎంత సేపట్లో మీకు అందుతుందో తెలుసుకోవచ్చు. రానున్న స్టేషన్లు, రెస్టారెంట్ల మెనూ చూసి ఆర్డర్ చూసుకునే అవకాశం వుంటుంది. మీకు ఫుడ్ డెలివరీ అయ్యాక హాయిగా వాటిని ఆరగించవచ్చు. ఫుడ్ క్వాలిటీ గురించిన ఆందోళన అవసరం లేదు.ఇంకెందుకు ఆలస్యం.. ఈసారి జర్నీలో మీరు కూడా ఈ ఫుడ్ యాప్ ట్రై చేయండి..
Read Also: RangaRanga Vybhavamga Team At Tirumala: తిరుమల శ్రీవారి సేవలో రంగరంగ వైభవంగా టీం