రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!

Zebronics Zeb Pixaplay 72 Plus

Zebronics Zeb Pixaplay 72 Plus

Zebronics Zeb-PixaPlay 72 Plus: హోమ్ ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జిబ్రానిక్స్ (Zebronics) భారత మార్కెట్లో కొత్త Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్ అనుభవాన్ని అందించేలా ఈ ప్రొజెక్టర్‌ను తయారైంది.

Zeb-PixaPlay 72 Plus ప్రొజెక్టర్ 1280×720 HD నేటివ్ రిజల్యూషన్ తో వస్తుంది. అయితే Full HD 1080p కంటెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. 40 అంగుళాల నుంచి 120 అంగుళాల (304 cm) వరకు స్క్రీన్ ప్రొజెక్ట్ చేయగలదు. 4000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు క్వాడ్-కోర్ ప్రాసెసర్ అందించారు. దీంతో యాప్‌లను నేరుగా ఉపయోగించి వినోద కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కోసం అదనపు డివైస్ అవసరం ఉండదు. కనెక్టివిటీ కోసం Wi-Fi 6 డ్యూయల్-బ్యాండ్ (2.4GHz/5GHz), బ్లూటూత్ 5.4, HDMI (ARC), USB, AUX OUT పోర్ట్‌లను అందించారు. అలాగే Miracast, iOS స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉండటంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైస్‌ల నుంచి వైర్‌లెస్‌గా కంటెంట్‌ను ప్రొజెక్ట్ చేయవచ్చు.

ఈ ప్రొజెక్టర్‌లో Auto Keystone Adaptation ఫీచర్ ఉండటంతో స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది. అలాగే 200 డిగ్రీల టిల్ట్ మెకానిజం కారణంగా వివిధ కోణాల్లో సులభంగా ప్రొజెక్ట్ చేయవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్, రిమోట్ కంట్రోల్ సపోర్ట్ కూడా ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. ఈ ప్రొజెక్టర్ 30,000 గంటల వరకు ల్యాంప్ లైఫ్ అందిస్తుంది. అంటే చాలా సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రొజెక్షన్ దూరం 1.2 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకు ఉంటుంది.

భారత మార్కెట్లో దీని ప్రారంభ ఆఫర్ ధర రూ.5,499కు అందుబాటులోకి వచ్చింది. దీని అసలు MRP రూ.12,999గా కంపెనీ ప్రకటించింది. ఈ ప్రొజెక్టర్‌ను అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.