YouTube: టీనేజర్లకు షాక్.. పేరెంటల్ కంట్రోల్స్, షార్ట్స్ స్క్రోలింగ్‌కు యూట్యూబ్ టైమ్ లిమిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube Parental Controls: యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైస్‌లపై తల్లిదండ్రులు నియంత్రణ పెట్టేందుకు అనేక టూల్స్‌ను అందిస్తోంది. తాజాగా, టీనేజ్ పిల్లల వీక్షణ అలవాట్లపై మరింత నియంత్రణ కల్పించేలా కొత్త ఫీచర్లను గూగుల్‌కు చెందిన ఈ వీడియో ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్‌ను టీనేజర్లు ఎంతసేపు స్క్రోల్ చేయవచ్చో పరిమితి విధించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే, వయసుకు తగిన కంటెంట్‌ను ప్రోత్సహించేలా కొత్త సూత్రాలు, క్రియేటర్ గైడ్‌ను కూడా రిలీజ్ చేసింది. పిల్లల కోసం కొత్త అకౌంట్లు సులభంగా క్రియేట్ చేసుకునేలా అప్డేటెడ్ సైన్-అప్ అనుభవాన్ని కూడా యూట్యూబ్ అందించనుంది.
Read Also: Junior NTR New Look: జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్.. నెట్టింట ఫోటోలు వైరల్!
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ఇక, తాజాగా విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్‌లో యూట్యూబ్ ఈ కొత్త అప్డేట్స్ వివరాలను వెల్లడించింది. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలు యూట్యూబ్ షార్ట్స్‌ను ఎంతసేపు చూడాలో స్పష్టంగా లిమిట్ పెట్టొచ్చు. త్వరలో షార్ట్స్ ఫీడ్‌ను పూర్తిగా ‘జీరో’కి సెట్ చేసే ఛాన్స్ ఉందని యూట్యూబ్ పేర్కొనింది. అవసరాన్ని బట్టి ఒక రోజు పూర్తిగా షార్ట్స్‌ను ఆపేయడం లేదా వినోదం కోసం గరిష్టంగా 60 నిమిషాల వరకు అనుమతించే అవకాశం ఉంది. 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 1 గంట లేదా 2 గంటలుగా షార్ట్స్ టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, సూపర్వైజ్డ్ యూట్యూబ్ అకౌంట్లలో బెడ్‌టైమ్, ‘టేక్ ఎ బ్రేక్’ రిమైండర్లను కూడా కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది.
అయితే, టీనేజర్లకు ఉపయోగకరమైన కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా కొత్తగా క్రియేటర్ గైడ్‌ను యూట్యూబ్ ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో ఖాన్ అకాడమీ, క్రాష్‌కోర్స్, టెడ్-ఎడ్ లాంటి విద్యాపరమైన వీడియోలను టీనేజర్లకు ఎక్కువగా సూచించనుంది. ఈ సూత్రాలను యూత్ అడ్వైజరీ కమిటీ, యూసీఎల్ఏకి చెందిన సెంటర్ ఫర్ స్కాలర్స్ అండ్ స్టోరీటెల్లర్స్‌తో కలిసి రూపొందించామని యూట్యూబ్ వెల్లడించింది. అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్, బోస్టన్ చిల్డ్రెన్స్ హాస్పిటల్‌కు చెందిన డిజిటల్ వెల్నెస్ ల్యాబ్ సహా పలు అంతర్జాతీయ సంస్థల నిపుణులు దీనికి సపోర్టు ఇచ్చారు. రాబోయే వారాల్లో అప్డేటెడ్ సైన్-అప్ విధానంతో టీనేజర్లను ఆటోమేటిక్‌గా అండర్-18 ప్రొటెక్టెడ్ అకౌంట్లలోకి తీసుకువచ్చేలా, తల్లిదండ్రులు మొబైల్ యాప్‌లోనే సులభంగా అకౌంట్ల మధ్య మారేలా యూట్యూబ్ ఈ కొత్త మార్పులను అమలు చేయనుంది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!