Site icon NTV Telugu

స్టైల్‌తో పాటు సౌండ్ కూడా.. Xiaomi Mijia Smart Audio Glasses గ్లోబల్‌గా లాంచ్..!

Xiaomi Mijia Smart Audio Glasses

Xiaomi Mijia Smart Audio Glasses

Xiaomi Mijia Smart Audio Glasses: రెడ్ మీ నోట్ 15 సిరీస్ గ్లోబల్ లాంచ్‌తో పాటు షియోమీ (Xiaomi) మరో కొత్త గ్యాడ్జెట్‌ను కూడా లాంచ్ చేసింది. షియోమీ మీజియా స్మార్ట్ ఆడియో గ్లాస్సెస్ (Xiaomi Mijia Smart Audio Glasses) పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ గ్లాసెస్ స్టైల్, ఆడియో టెక్నాలజీని ఒకే ఫ్రేమ్‌లో కలిపాయి. ఓపెన్-ఇయర్ ఆడియో టెక్నాలజీతో రూపొందించిన ఈ గ్లాసెస్‌లో ఇన్‌బిల్ట్ స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి.

ఈ గ్లాస్సెస్ ను “బిజినెస్ ఎలైట్స్‌కు ప్రైమ్ చాయిస్”గా షియోమీ ప్రమోట్ చేస్తోంది. ప్రీమియం లుక్‌తో పాటు కూల్ యాక్సెసరీగా దీనిని డిజైన్ చేశారు. టైటానియం, పైలట్-స్టైల్, బ్రౌలైన్ అనే మూడు క్లాసిక్ ఫ్రేమ్ ఆప్షన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఇంటర్‌చేంజ్ చేయగల ఫ్రేమ్‌లు, ప్రిస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఇవి అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రూ.12.54 లక్షలకే సన్‌రూఫ్ ఉన్న Kia Carens Clavis HTE (EX).. ప్రీమియం ఫీచర్లు ఇవే!

ఆడియో ఫీచర్స్:
ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో SLS0820 అల్ట్రాసోనిక్ స్పీకర్ ను ఉపయోగించారు. ఇది ఎయిర్-కండక్టెడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా క్లియర్ సౌండ్ అందిస్తుంది. 4.5 మీ/సె. విండ్ నాయిస్ రిడక్షన్ సపోర్ట్ ఉండటంతో బయట శబ్దాలు ఉన్నా కూడా ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది. అంతేకాకుండా డ్యూయల్ సౌండ్ లీకేజ్ ప్రొటెక్షన్‌తో కూడిన ప్రత్యేక ప్రైవసీ మోడ్ అందించారు. దీని వల్ల శబ్దం బయటకు లీక్ కాకుండా ఉంటుంది.

బ్యాటరీ & ఛార్జింగ్:
ఈ కొత్త షియోమీ మీజియా స్మార్ట్ ఆడియో గ్లాస్సెస్ లో 114mAh సామర్థ్యంతో రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఇవి 13 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్‌తో 4 గంటల వినియోగం సాధ్యమవుతుంది. స్టాండ్‌బైలో 11 రోజులు, సాధారణ వినియోగంలో 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి.

స్మార్ట్ ఫీచర్స్, యాప్ సపోర్ట్:
షియోమీ గ్లాస్సెస్ (Xiaomi Glasses) అనే యాప్ ద్వారా జెష్చర్ కస్టమైజేషన్, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేషన్, ఫైండ్-మై-గ్లాసెస్ ట్రాకింగ్, ఆడియో/మీడియా రికార్డింగ్ వంటి ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు. రికార్డింగ్ సమయంలో ప్రైవసీ కోసం LED ఇండికేటర్ కూడా ఉంది. అలాగే ఫోన్, ల్యాప్‌టాప్‌ల మధ్య డ్యూయల్ డివైస్ కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది.

Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ రికార్డు.. ‘చికిరి చికిరి’ సాంగ్‌కు 200 మిలియన్ వ్యూస్..!

డిజైన్:
ఈ గ్లాసెస్‌లో పియానో-వైర్ హింజెస్ ఉపయోగించారు. ఇవి 15,000 సార్లు మడిచినా మన్నికగా ఉండేలా రూపొందించారు. IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంది. టెంపుల్ టచ్ ప్యానెల్ ద్వారా కంట్రోల్స్ నిర్వహించవచ్చు.

ధర:
షియోమీ మీజియా స్మార్ట్ ఆడియో గ్లాస్సెస్ టైటానియం వేరియంట్ ధర EUR 199 (రూ. 20,900) కాగా.. బ్రోలైన్, పైలట్-స్టైల్ వేరియంట్లు EUR 179 (రూ. 18,800)కి లభిస్తాయి. ఈ స్మార్ట్ ఆడియో గ్లాసెస్ ఇప్పటికే పలు దేశాల్లో అమ్మకాలకు అందుబాటులో ఉన్నాయి. స్టైల్‌తో పాటు స్మార్ట్ ఆడియో అనుభవం కోరుకునే వారికి ఇవి కొత్త ఆప్షన్‌గా నిలవనున్నాయి.

Exit mobile version