Xiaomi Diwali Sale 2026: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి Xiaomi అదిరిపోయే ఆఫర్లతో ముందుకొస్తోంది. Xiaomi తన వార్షిక ‘Diwali with Xiaomi Sale 2026’ను అక్టోబర్ 8 నుంచి ప్రారంభించనుంది. ఈ సేల్‌లో కంపెనీ వివిధ ప్రొడక్టులపై 50 శాతం వరకు డిస్కౌంట్లు అందించనున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై కస్టమర్లు రూ.15,000 వరకు నేరుగా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
Xiaomi 17 Ultraపై భారీ ఆఫర్
Xiaomi ప్రీమియం ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Ultraపై కూడా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలతో ఈ ఫోన్‌ను రూ.1,29,999 ఎఫెక్టివ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. Xiaomi 17 Ultra కొనుగోలుదారులకు రూ.19,999 విలువైన ‘Photography Kit Pro’ను ఉచితంగా అందించనున్నారు.
Redmi Note 15 SEపై డిస్కౌంట్
మిడ్‌రేంజ్ విభాగంలో ఉన్న Redmi Note 15 SEపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి.
6GB + 128GB: రూ.22,999
8GB + 128GB: రూ.24,999
8GB + 256GB: రూ.26,999
ప్రస్తుతం ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ధర రూ.25,999గా లిస్ట్ అయి ఉంది. సేల్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌పై గణనీయమైన ఆదా చేసుకోవచ్చు.
Redmi Turbo 5 5G ధర ఎంత?
Redmi Turbo 5 5G కూడా ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. బ్యాంక్ డిస్కౌంట్లను కలుపుకుని దీని ఎఫెక్టివ్ ధర రూ.37,999కు తగ్గనుంది. Xiaomi India అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ లిస్టెడ్ ధర రూ.41,999గా ఉంది. అంటే సేల్ సమయంలో మంచి ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Xiaomi 17T, Xiaomi 17 Ultraపై ఆఫర్లు
ప్రీమియం సెగ్మెంట్‌లోని ఇతర మోడళ్లకు కూడా Xiaomi ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. Xiaomi 17Tను ఆఫర్లతో రూ.64,999కు కొనుగోలు చేయవచ్చు. ఇక ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Ultra బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.1,29,999 ఎఫెక్టివ్ ధరకు లభించనుంది.
Redmi Note 17 సిరీస్‌పై కూడా భారీ డీల్స్
ఇటీవల విడుదలైన Redmi Note 17 సిరీస్ పై కూడా బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్‌లో Redmi Note 17 5G, Redmi Note 17 Pro, Redmi Note 17 Pro Max మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించారు.
సేల్‌లో ఈ ఫోన్ల ఎఫెక్టివ్ ధరలు:
Redmi Note 17 5G: రూ.26,000 కంటే తక్కువ
Redmi Note 17 Pro: రూ.33,999 నుంచి
Redmi Note 17 Pro Max: రూ.44,999 నుంచి
50% వరకు డిస్కౌంట్.. ఎక్స్చేంజ్, EMI ఆప్షన్లు
Xiaomi ప్రకారం Diwali Sale 2026లో స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్టులపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 వరకు నేరుగా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

